నిజం సాక్ష్యాల కన్నా గొప్పది
నాయకత్వాల కన్నా,హీరోయిజాల కన్నా మానవత్వం గొప్పది.
మనిషి జన్మ ఎత్తినందుకు,మనిషి లాగానే బతకాలనీ,మనిషి గుణాలు ఉండాలని నమ్మే వాడిని నేను.
నపుంసకత్వం రాలేదని స్వీయ నిర్ధారణకు వచ్చేందుకు స్కూలు పిల్లల మీద,ముసలమ్మల మీద ,మానసిక వికలాంగుల మీద తమ ప్రతాపం చూపించే వారికీ,
ప్రేమ పేరుతో వలలో వేసుకోని,నిర్దాక్షిణ్యంగా వదలివేసి,తమ చవటతనాన్ని అమ్మానాన్నల చాటున,కులమతాల మాటున,డబ్బుకట్టల వెనుకా దాక్కునే వారికీ పెద్ద తేడా లేదు ...... నాదృష్టిలో.
ఏరంగంలోని హీరోలనయినా జనం అభిమానిస్తారు,
పిరికివాళ్ళను చూసి గేలి చేస్తారు, పాపం అని సానుభూతి చూపిస్తారు,
సినిమా హీరో పిరికి వాడిగా నటిస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారు,
జీవితంలో పిరికివాడు హీరో గా మారేందుకు ప్రయత్నిస్తే
మొదట నవ్వుతారు,తర్వాత ప్రోత్సహిస్తారు.
కానీ,
హీరోలుగా ఫోజులు కొడుతూ నిజజీవితంలో భీరువులను మనమేమి చేయాలి?
నేను మరి కొంత మంది బ్లాగర్లూ అలాంటి చెత్తాచెదారాన్ని మళ్ళీ మరే ఇంటి వాకిట్లో ఎవరూ పడేయకుండా వుండాలని కోరుకుంటున్నాము.
మిగిలిన వారు మౌనంగా అమోదిస్తున్నారు.
నన్ను వెధవ అన్నాడో అనానిమస్.అందుకు నేను ఏ మాత్రం ఫీలవను.అవను కూడా.తల్లి కడుపున పుట్టి,అక్కచెల్లెళ్ళతో
పెరిగి,స్నేహితురాళ్ళతో కలసి చదువుకొని,ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని,పిల్లలను కని,మామూలుగా,కుడిచేత్తో కడుపుకు అన్నం తినేవారు
ఎవరయినా,సమాజంలో పక్కవారికి అన్యాయం జరిగిందంటే మనిషిగా స్పందించటం ప్రాణాలతో ఉన్నవారి ప్రాధమిక లక్షణంగా ఉండాలి.
ఆర్తీని ఫలానవాడు మోసం చేసాడు అనేందుకు నీ దగ్గర అధారాలున్నాయా?నువ్వు చూశావా అంటే,
నిజం ఎప్పుడూ,సాక్ష్యాలకన్నా గొప్పదంటాను,
అత్మహత్యా యత్నానికి పాల్పడేందుకు అమ్మాయిలపై వస్తున్న ఒత్తిళ్ళేమిటి?
ఎవరయినా ఎందుకు బలవంతంగా చావాలనుకుంటారు?
ఒక్క సారి ఆలోచించండి
ఊరు, పేరు లేకుండా నాబోటి వాళ్ళ మీద రాళ్ళేసే బదులు మీ పరిసరాల్లో ఇలాంటి విషయాల్లో
దగా పడ్డ కుటుంబసభ్యులకు చేతనయింత సాయం చేయండి.లేదంటే నైతిక మద్దత్తు ఇవ్వండి.
అంతే కానీ ఆ నిస్సహాయులపై మరో రాయి వేయకండి.
*********
మణిరత్నం గురించి రాసి టైము వేస్టు చేసుకోవద్దన్నారు ఒక మిత్రుడు.నిజమే.బ్లాగర్లలో చాలామంది అతనేదో, మామూలు మనిషే కాదేమో
అన్నట్లు రాస్తుంటే నేను రాస్తున్నాను.అలాగే మొన్న ఎవరో త్రివిక్రంశ్రీనివాస్ గురించి
రాస్తూ అకాశానికెత్తే ప్రయత్నం చేసారు.'అతడు చూసి నేనూ సంతోషించాను.అంత మాత్రాన ఆ సినిమా ఒక హిందీ సినిమాకు 60శాతం నకలు
అని చెప్పడం మానేస్తామా? చెప్పుకోండి చూద్దాం.అతడు హింది లో ఏ సినిమా?చిన్న క్లూ అందులో సుష్మితా సేన్ హీరోయిన్.
Friday, November 23, 2007
ఆర్తీని ఫలానవాడు మోసం చేసాడు ....!!!!!?????
రాసింది
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
Subscribe to:
Post Comments (Atom)

7 వ్యాఖ్యలు:
Tum ko na bhool paayenge - athadu ki original kaadu. there are a few similarities but athadu is not a true copy.
aa maata ki vaste - antham + vaarasudochaadu kalipinaa athadu first half vachestundi. antham, assassins, US marshal (oka scene), varasudochaadu, tum ko na bhool paayenge laanti chaala stories kalipi kichidi chesthe - athadu avutundi. But writer idi conscious ga chesi vundaka povachu. aa cinemaa lannee choosaaka - story tayaaru chesetapudu annee automatic ga influence chestaayi.
ayinaa 'already trivikram teesesaadu, janaalu choosesaaru, hit kooda ayipoyindi' manam ipudu fresh ga research cheyademenduku.
anyway ur blog is nice.
thank you mohanraaz,i know many people are very much aware of the fact Athadu is an amalgamation many flicks.but the recent heroworshipping of him of late has become so annoying.perhaps that was one the reasons promted me.
భయ్యా, నీ బ్లాగు ఇవ్వాళే చూశాను. నాకు నచ్చింది. hypocrisy లేకుండా ఇలాగే వ్రాయి.--తెలుగు అభిమాని
ever body will have their own opinions. you do not have right to say others to change their opinions.
when are writing on controversial matters that to public for viewing you should have courage to face all types of comments.
maniratnam and trivikram may are not great for you. but the both had given lot of inspiration to the people ,who want to enter into respective field , direction and writing
నిజమే ఎనానిమస్ మేష్టారు,అదే సూత్రం మీకు ఎందుకు వర్తించదు.చూడబోతే మీరు నాకు చాలా స్రేయోభిలాషి అవుతారని అనిపిస్తూ ఈ మాటలు రాస్తున్నను.మణిరత్నం తెలుగులో తీసింది ఒక్క సినిమా,అదీ వేరే హింది సినిమాకు దాదాపు నకలు.నేను గతంలో పాల్గొన్న చర్చ వివరాలు మీకు తెలియవు కాబట్టి ఇదంతా.ఇంత మంచి సలహాలు ఇచ్చే మీరు కనీసం పేరు ఎందుకు రాయలేక్పోతున్నరో నాకు అర్ధం కావట్లేదు.
బాస్..గీతాంజలి ఒక హింది మూవీ కి దాదాపు నకలు అన్న వాక్యాన్ని కొంచెం సవరించడానికి ఈ కామెంట్ రాస్తున్నా..బహుశా మీరు 'మిలన్ ' అనే హిందీ సినిమా గురించి చెబుతున్నారనుకుంటా. ఈ సినిమా యే గీతాంజలి కి ఇన్స్పిరేషన్ అని చాలా మంది అనడం నేనూ విన్నా. కానీ దానికి దీనికీ ఏ సంబంధం లేదు. మీరు చెబుతున్న ఆ హిందీ సినిమా ఏంటి ఇంతకీ??
మోహన్ రాజ్ గారు,మిలన్ పేరుతో హిందీ లో ఇప్పటి మూడు సినిమాలు వచ్చాయి.మనకు అందరకీ బాగా తెలిసిన సినిమ మాత్రం 1967 లో వచ్చింది.సునీల్దత్,నూతన్ వగైరా తాగణం కాగ్ఫా,ఇది మన్ మూగమనసులు కు రీమేక్.నేను ప్రస్తావించేది వేరే సినిమా.త్వరలోనే ఆ బ్లాగ్ పోస్టింగ్ చేయగలను.
Post a Comment