దుర్గగుడిని దర్శించుకున్న శ్రిజ దంపతులు,శ్రీవారి దర్శనం చేసుకున్న శ్రీజదంపతులు,అత్తమామలతో శ్రిజ,అధ్భుతం! బ్రిటీషు బుడతరాజులు హెన్రీ,విలియెంస్ కూడా ఈమాత్రం పబ్లిసిటీకి నోచుకోలేకపోతున్నారు.నాకు విశ్వసనీయంగా తెలిసిందేమిటంటే ఈమధ్య శ్రిజ దంపతులు కనీసం రెండు సార్లు షాపింగుకు,ఒక సారి రెస్టారెంటుకూ,ఒక్క సినిమాకూ వెళ్ళారు.మరి మనం ఏమి పాపంచేసామో ఒక్క టీవిచానెలూ,ఏఒక్క న్యూసు పేపరూ ఆ వార్తను మనకు అందించలేకపోయాయి.ఇకనుంచైన ఇలాంటి లోటుపాట్లు జరగకుండా సంబంధిత వర్గాలవారు జాగ్రత్తలు తీసుకుంటారని నా నమ్మకం.
Saturday, December 8, 2007
Subscribe to:
Post Comments (Atom)


10 వ్యాఖ్యలు:
అయినా ఇంకా పిల్ల మేటరును ఎవరు రాస్తారు.ఎకంగా చిరునే స్క్రీన్ మీదకి వచ్చేస్తే.
అది వారి వ్యక్తిగత విషయం.
ప్రేమించి పెళ్ళాడటమేనా వారు చేసిన తప్పు?!
వారు షాపింగికి వెల్తే మీకేమిటి ఇంకేదో చేస్తే మీకేమిటి?
రేపు వాళ్ళు పడకగదుల్లోకి కూదా దూరి వ్రాస్తారా? చూపిస్తారా?
ఆ వివరాలు తెలుసుకుని మీరు ఏం చేస్తారండి?
చదువుకున్నవారు, మీరు కూడానా?!
@ నెటిజెన్ గారు
పెద్దలు మీకు కోపం తెప్పించినందుకు మన్నించాలి. నా బాధ కూడా అదే.వారిని మన మీద బలవంతంగా రుద్దటం ఎందుకూ అనేదే నా ప్రశ్న.వారిద్దరు ఏంచేసినా వార్తవుతున్నప్పుడు మీదుంపల్తెగా వాళ్ళు షాపింగుకు వెళ్ళిందీ,సినిమాకు వెళ్ళిందీ,రెష్టారెంటుకు వెళ్ళింది మాత్రం ఎందుకు వదిలేశారూ అన్నదే నా ప్రశ్న.వ్యంగాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేనందుకు సిగ్గు పడుతున్నాను.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
@ రాధిక గారూ,
గతంలో నేను పనిచేసిన ఒక తెలుగుపత్రికలో అప్పటి రాష్ట్రపతి హైదరాబాద్ లో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే లోపలి పేజీల్లో వార్త ప్రచురించారు,ఎందుకలాగా అని నేను అడిగితే దాని న్యూస్ వాల్యూ అంతే అన్నారు. మరి ఈరోజు?వార్తలను పచ్చిచేపలుగా భావించి,ఎక్కువరోజులు కాదు క్షణాలు మనదగ్గర ఉంటే చద్ది(స్టేల్) పడతాయని -ప్రేక్షకుల మీదికి విసిరే క్రమంలోదే ఈ ఆదుర్దా,కక్కుర్తీ. సెలబ్రిటీస్ ను తయారు చేసె విధానం మనం ఈరోజు రాష్ట్ర మీడియాలో ప్రత్యక్షంగా చూడగలుతున్నాం.
పత్రికా రంగంలో విలువలు గురించి చర్చిస్తూ (ఆయన పేరు మర్చిపోయాను) ఏంవ్రాసారంటే, మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు "ద హిందు" దిన పత్రిక మొదటి పుటలో, ఒక నిలువు గడి వార్తగా వ్రాసింది, అంటే ఆ రోజుల్లో ఆ వార్తకి ఇచ్చిన ప్రాముఖ్యత అది. అదే ఇప్పుడైతే వీధి నాయకుడి గురించి కూడా నిలువెత్తు చిత్తరువులతో మొదటి పుట అంతా వారి గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికల్లో వార్తలు నమ్మాలంటేనే కష్టంగా ఉంటోంది.
నమస్కారలతో,
సూర్యుడు :-)
రాజేంద్ర గారూ.., మీరు వ్యంగాన్ని సరిగానే వ్యక్తీకరించారని అనుకుంటున్నా..! వ్యాఖ్యలే సరిగా లేవు..!!
ప్రొద్దున్నే లేవగానే ఇలాంటి విశేషాలు చదవాలండి - లేకపోతే మనకి తెలియకుండా వాళ్ళు అలా సినిమాలకి షికార్లకి తిరిగేస్తే ఎలా??
హహ్హ.
manam chaduvutunnam kabatte vallu raastunnaru andi
Post a Comment