Monday, March 24, 2008

శోభన్ బాబు అంత్యక్రియల్లో టీవీ చానళ్ళ యాగీ

అంత్యక్రియలపై మన ఘనత వహించిన టీవీ చానళ్ళవారు చేసిన యాగీని ఆంధ్రభూమి పత్రిక ఎలా ఎత్తిపొడిచిందో ఇక్కడ చదవండి.
http://andhrabhoomi.net/weakpoint.html

5 వ్యాఖ్యలు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"..కొయ్యబారి...వికారం...ముసలిమొహం...భయపడి..."

తప్పుపట్టాల్సింది టి.వి,ఛానల్సు వాళ్ళని కాదు, ఆంధ్రజ్యోతినే. అగౌరవం చూపించింది వాళ్ళు కాదు, ఆంధ్రజ్యోతే. ఒక గౌరవనీయుడైన కళాకారుడు, పబ్లిక్ ఫిగర్ చనిపోతే రాయాల్సిన మాటలేనా ఇవి ? మీడియాని శోభన్‌బాబు దూరంగా ఉంచినందుకా ఈ కసి ఆయన మీద ఆంధ్రజ్యోతికి ? ఆయనిష్టం - ఆయన తన మొహం చూపించుకుంటాడు, మానుకుంటాడు. ఆంధ్రజ్యోతికేంటి ఇంత దురద ?

ఈ ఆంధ్రజ్యోతి అతివాగుడు, ఓవర్ యాక్షన్ నుంచి తెలుగుజాతికి ఎప్పుడో విముక్తి ?

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

బాలసుబ్రమణ్యం గారూ ఆ పత్రిక ఆంధ్రజ్యోతి కాదండి, ఆంధ్రభూమి దినపత్రిక

indianminerva said...

అసలైనా శవదహనాన్ని కూడా T.V. లో చూపించడమేమిటండీ మరీనూ. ఇంకానయం దాన్ని live telecast చేయలేదు. ఇక ఆంధ్రభూమి సరేసరి. వాళ్ళేం యాగీ చేసారో తెలియదుకానీ, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా నోరుపారేసుకున్నరని చెప్పగలను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రాజే౦ద్రకుమార్ గారు సవరి౦చిన మీదట నా పొఱపాటు సరిదిద్దుకు౦టున్నాను. నా వ్యాఖ్యని ఇలా చదువుకోవలసి౦దిగా ప్రార్థన :

"..కొయ్యబారి...వికారం...ముసలిమొహం...భయపడి..."

తప్పుపట్టాల్సింది టి.వి,ఛానల్సు వాళ్ళని కాదు, ఆంధ్రభూమినే. అగౌరవం చూపించింది వాళ్ళు కాదు, ఆంధ్రభూమే. ఒక గౌరవనీయుడైన కళాకారుడు, పబ్లిక్ ఫిగర్ చనిపోతే రాయాల్సిన మాటలేనా ఇవి ? మీడియాని శోభన్‌బాబు దూరంగా ఉంచినందుకా ఈ కసి ఆయన మీద ఆంధ్రభూమికి ? ఆయనిష్టం - ఆయన తన మొహం చూపించుకుంటాడు, మానుకుంటాడు. ఆంధ్రభూమికేంటి ఇంత దురద ?

ఈ ఆంధ్రభూమి అతివాగుడు, ఓవర్ యాక్షన్ నుంచి తెలుగుజాతికి ఎప్పుడో విముక్తి ?

madhu said...

You are right.... The media is overacting now adays on any issue. Particularly the TV media...