Saturday, April 5, 2008

"నాకు ఏమీ తెలియదని తెలుసుకోగలిగాను"

చాలా శతాబ్దాల క్రితం సోక్రటీసుమహర్షుల వారు అనే తత్వవేత్త గ్రీసు దేశంలోని ఏధెన్స్ నగరంలో విద్యార్ధులకు కాస్త నీతి ,న్యాయం,మంచిచెడుల విచక్షణ వంటి అంశాల గురించి బోధిస్తూ ఉండేవాడు.ఋజువర్తన అంటే,నైతికతను నిర్వచించగలమా?తదితర విషయాలను సాధారణ ఉదాహరణలతో,సామాన్య సాదృశ్యాలతో వివరిస్తూ ఉండేవాడు.ఎథిక్స్ అనబడే తత్వశాస్త్ర విభాగానికి దాదాపు ఆద్యుడు,వెస్ట్రన్ ఫిలాసఫీకి పునాదులు వేసినవారిలో ప్రముఖులలో అగ్రగణ్యుడైన సోక్రటీసుల వారికి ప్లేటో అనే ప్రియశిష్యుల వారు ఉండేవారు.

సోక్రటీసుమహర్షుల వారు
ప్రశ్నించటం అనేది ఎప్పటి పాలకులకైనా ఇబ్బందే.దానితోదైవనింద చేస్తున్నాడు,యువతను తప్పుదోవ పట్టిస్తునాడనే నెపంతో బంధించి,మరణ శిక్ష విధించారు.బందిఖానా నుండి తప్పించుకునే అవకాశాలు ఎన్నున్నా హెంలాక్ అనే విషం తాగి కన్నుమూశారు ఆ మహర్షుల వారు.

సోక్రటీసుల వారి శిష్యుడు ప్లేటో,
ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్,
అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్,ఆ అలెగ్జాండర్ ప్రపంచాన్ని(?)జయించటంతో తద్వారా వారి పాశ్చాత్య నాగరికత పత్తివిత్తనాల్లా పాకింది నలుచెరగులా.

సోక్రటీసుల వారి అర్ధాంగి పేరు జాంతపి,గయ్యాళితనానికి మారు పేరుగా వాడుతున్నారు.
సోక్రటీసుల వారు బోధించినవన్నీ గ్రంధస్తమయ్యాయి,శతాబ్దాలుగా వాటిని లక్షలాదిమంది అధ్యయనం చేస్తున్నారు.
వారు చెప్పిన వాటిలో రెండు ఆణిముత్యాల వంటి సూక్తులను పరిశీలిస్తే...
అపరిక్షిత జీవితం నిరర్ధకం,( The unexamined life is not worth living.)

"నాకు ఏమీ తెలియదని తెలుసుకోగలిగాను" ఆయనే నిన్ను నీవు తెలుసుకో( "Know thyself.") అని కూడా చెప్పాడు.

మొదటిది:మన జీవితాలను తరచూ మూల్యాంకనం చేసుకోవాలి,కాలక్రమంలో చాలా చెత్తా చెదారం పేరుకుంటుంది తుడిచిశుబ్రం చేసుకొ మళ్ళీ శుభ్రంగా అంతఃకరణను ఉంచుకో,

రెండొది...నీకు చాలా తెలుసను కుంటావు,కానీ నీకు ఏమీ తెలియదు అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోగలిగిన నాడే నీకు సంపూర్ణ జ్ఞానం సంప్రాప్తించినట్లని,

పాశ్చాత్య తత్వవేత్తలు తరచూ "Summum bonum"అనే పదాన్ని వాడుతుంటారు.మానవులు తమతమ జీవితాల్లో ఆచరించి సాధించాల్సిన మహోన్నత ఆశయం అని వారి అర్ధం.
ఈ పదం ఒక్కొరికి ఒక్కొక్క విధంగా అర్ధమౌతూ ఉంటుంది.

మన ముందున్న లక్ష్యాలు ఏమిటి?వాటిని చేరేందుకు మనం ఎంచుకున్న మార్గాలు, వాటిల్లో మళ్ళీ మన ప్రాధాన్యాలు ఇవి మనం మనస్ఫూర్తిగా ఆచరించగలమా?అడ్దంకులు నిజంగా ఉన్నాయా లేక మనమున్నాయీ అనుకుంటున్నామా?ఇలా సాగుతుంటుంది భావధార.

ఈ క్రమంలో మన జీవితానికున్న ఆశయం ఏమిటో చాలా వరకూ మన మనో నేత్రాల ముందు సాక్షాత్కరిస్తుంది.సాధిస్తున్నామా లేదా అన్న సంగతి పక్కన పెడితే,
ఫస్ట్ కిస్ ఆఫ్ ఏ లేడీ,
మిడిల్ కప్ ఆఫ్ ఏ కాఫీ,
లాస్ట్ పఫ్ ఆఫ్ ఏ సిగరెట్ అన్నారు,
కానీ ఇవేవీ శిలాశాసనాలు కాదు.అసలు ప్రకృతిలో నిశ్చితమైన నిబంధనలు ఏమీ లేవని కొందరి ఉవాచ.


నల్లనయ్యలను దాస్యవిముక్తులను చెయ్యాలని కంకణబద్ధ్డుడైన అబ్రహాం లింకన్ అమెరికా సంయుక్తరాష్ట్రాల అంతర్యుద్ధాన్ని అరికట్టే క్రమంలోవిరామం తీసుకున్నాడు,విజయం సాధించాడు.

భారతావనిని దాస్య శృంఖలాల నుండి విముక్తం చేసే ప్రక్రియలో కోట్లాది మందికి దిశానిర్దేశం చేసిన గాంధీ అంతటి మహాత్ముడు
అంబేద్కర్ నడుపుతున్న,నాయకత్వం వహిస్తున్న సంఘర్షణ నుండి

స్ఫూర్తి పొంది తను బాల్యం నుండి,తన జీవితంతో మమేకమైన ఎన్నో మౌలికవిశ్వాసాలను వదులుకొని నిరంతర విద్యార్ధిగా నిలబడ్డాడు.


వారు అరుదైన మినహాయింపులు.

కోట్లాది మందికి పుట్టటం,బ్రతకటం,గిట్టటం లోనే కాలం తెలియదు.ఇహ,పరలోక చింతనకు వాళ్ళు ఆట్టే విలువ ఇచ్చినా అది పెద్ద మార్పు తేబోదు.

మన చదువును,నేర్చుకున్న,సాధించుకున్న విజ్ఞానాన్ని బట్టి,మనకున్నపదనిధి(vocabulary)ని బట్టి మన ఆలోచనావిధానాలు ఉంటాయని,బెర్టాండ్ రస్సెల్ అంటాడు,

,"an enquiry into th emeaning of truth "అనే తన గ్రంధం లో.



మన పవిత్ర భారత దేశంలొ ఇవ్వాళ్టికీ అక్షరాస్యులు ఎందరో మనకు తెలుసు.ఇవ్వాళే ఇలా అఘోరిస్తుందంటే,వందల,వేలయేళ్ళనాడు సామాన్యులు ఎలా ఉండే వారో,ఉన్నతాశయాల లాంటి పెద్దమాటలు వారి కసలు ఊహాతీతమేగా!
తనను తాను తగ్గించుకోవటం,ఎదుటివారిలో కూడా తనను దర్శించుకోవదం,ఇంకాస్త మంచిగా ఉండేందుకు యత్నించటం వీటిని జీవితాదర్శాల్లుగా స్వీకరించవచ్చు దాదాపుగా అందరూ.

కొత్తపాళీ గారి మీ జీవిత పరమార్ధం ఏవిటి? టపాలో కామెంటు రాద్దామని మొదలుపెట్టితే, ఇలా ఒక వ్యాసరూపం దాల్చింది

11 వ్యాఖ్యలు:

koresh said...

purthiga chadava kunda edo okati rasda mane mi thapana chaala baagundi, greeku philosophy ki mulam vydic philosophy anedi teluarthamsukovaali.vidurudu, gargi venudu, ekalavyudu,yagna valkudu etc medavulu pravacinchina desam, forward cast ki chendina vaaru raayaledu bharathanni, raamayannanni, yadavudu cheppinna GEETHA...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అయ్యా కోరేష్ గారు మీ గురించి నాకు తెలియదు గానీ నేను మాత్రం ఐదు సంవత్సరాలు ఫిలాసఫీ వెలగబెట్టా.మీరు చెప్పినట్టు గ్రీకు ఫిలాసఫీకి వైదిక్ ఫిలాసఫీ మూలమయ్యుంటే నాకన్నా సంతోషించేవాడు లేడు.ఆ వివరాలేవో చెప్తే నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్లకూ ఒకసారి చూపిస్తా.

Dr. Ram$ said...

బాగా చెప్పారు.. కాని చివరి పేరా లో మీరు చెప్పినది సమర్దనీయము గా లేదు.. ఉన్నత ఆశయాల కి అక్షరాస్యత ఒక్కటే ప్రామాణికం కాదు అనుకుంటాను..ఉన్నత ఆశయాలు అనేవి కాలానుగుణం గా వుంటాయి..మన చుట్టూ వుండె సమాజం, ఆ సమాజాన్ని మనం చూసే కళ్ళ ని బట్టి వాళ్ళ ఉన్నత ఆశయాలు ఉంటాయి..ఇంకా చాలా ఉంటాయి ఆండి, నా ద్రుష్టి లో యీ చదువు, పద నిది యివి అన్ని కమ్యునికేషన్ కోసమే..యి తర్కము ఒక చిన్న కామెంట్ లో ముగించేది కాదండి..మొత్తానికి కొత్త పాళి గారు, మీరు బలే మొదలు పెట్టారు.. సంతోషం..

kasturimuralikrishna said...

hello,meeru meeku mail cheayamannaru cheasaanu.reply raaledu.na mail kmkp2025@gmail.com

జాన్‌హైడ్ కనుమూరి said...

good information & line up.


కొన్ని పదాలు ఎబ్బెట్టుగా వున్నాయనిపించింది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ధన్యవాదాలు జాన్ గారు,మీరు అన్న ఆ ఎబ్బెట్టు పదాలను చెప్పగలిగితే శ్రమని భావించక మరో సారి అవి దొర్ల కుండా జాగర్త పడతాను.

కొత్త పాళీ said...

రాజేంద్రా .. అది మీరు రాసే తీరులో ఉందో అసలు సరుకులోనే ఉందో తెలీదు గానీ మీతో కొంటె వాదన వేసుకో బుద్ధి అవుతోంది. కానీ ఆ పని చెయ్యను .. పక్క దారిన పడి పోతాం.
నేను ఏ ఫిలాసఫీ చదవలేదు .. ముందే చెబుతున్నా.
పైన మీరు సోక్రటీసు చెప్పాడని అంటున్న వాక్యం - నిన్ను నీవు తెలుసుకో - అన్న దాన్ని బట్టి జీవిత పరమార్ధం మనిషి మనిషి కి వేరుగా ఉంటుందని అనుకోవచ్చా.
లింకన్, గాంధీ, అంబేడ్కర్ - ముగ్గురు మహానుభావుల్ని ఉదహరిస్తూ వీళ్ళు మినహాయింపులు అన్నారు - దేనికి మినహాయింపులు?
చివర్లో రస్సెల్ గారి ఉవాచా ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది కానీ, బహుశ నిజమే కావచ్చు.
ఇంతకీ .. ఈ జీవిత పరమార్ధం .. moment of clarity అనేది అనుభవైక వేద్యం కాదా? పుస్తకాలు చదివి, లేదా ఆలోచన ద్వారా ఏమి నేర్చుకుంటము దీన్ని?

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

గురూజి,మీ అనుమానాలకు సమాధానంగా ఒకటో,మరి కొన్నో టపాలు అవసరమౌతాయి.రాస్తా మెల్లగా.

సత్యసాయి కొవ్వలి said...

రాజేంద్రా .. కొపా గారికొచ్చిన సందేహమే నాకూ వచ్చింది- మీరుదహరించిన అంబేద్కరాదులు దేనికి, ఏరకంగా మినహాయింపులు? తత్వశాస్త్రం నేను చదువుకోలేదుకాబట్టి పెద్దగావాదించలేను. కానీ గ్రీకు పురాణాల్లో బుద్ధుడి కథ (పేరు వేరే) ఉందని, ప్లాటో ఇండియా పర్యటించాడని (నేర్చుకోవడం కోసం) చదివా.
ఆతర్వాత మీ టపా కొద్దిగా rehash చేస్తే బాగా అర్ధమవుతుందనిపిస్తోంది. అయినా Phylosophy తో వచ్చినచిక్కే ఇదేమో- ఎంత సింపులుగా రాసినా అర్థం చేసుకోవడంకష్టం.
మీరు అక్షరాస్యతకీ, పరమార్ధగ్రహణశక్తికీ పెట్టిన లంకె సత్యదూరంగా ఉంది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సాయి గారు,ధన్యవాదాలు.నేను ఉదహరించిన వారిలో అంబేద్కరును చూసి నేర్చుకున్న గాంధీ,అలాగే నల్లజాతి వారి దాస్యవిముక్తి కోసం పోరాడుతూ,మధ్యలో వచ్చిన అంతర్యుద్ధం తో తాత్కాలికంగా విరామం తీసుకున్న అబ్రహాం లింకన్ తాము జీవితాదర్శం అని భావించిన వాటి నుండి కొద్దో,గొప్పో బయటకు వచ్చిన వారికి ఉదాహరణ.అంత మాత్రాన వారి ఘనత కొచ్చిన చిన్నతనం ఏమీ లేదు.కొత్తపాళీ గరు,మీరు లేవనెత్తిన సందేహాలకు త్వరలో రాయనున్న టపాలో నా శక్తి మేరకు బదులివ్వగలను.
రాజేంద్ర

bolloju ahmad ali baba said...

జీవిత పరమార్ధం పై మీరుదహరించిన సోక్రటిస్ తన చరమాంకంలో విషాన్నిచ్చి తాగమన్నప్పుడు ఇలా అంటాడు, ' సమయం వచ్చేసింది, మీరు ఉండటానికి నేను పోవటానికి, ఏది ఉత్తమ మైన మార్గమనేది కాలమే నిర్ణయించాలి ! ' దిమ్మ తిరిగి పోయే సందేహం ఇప్పటికీ ఒక సందేహమే. మాజూవాలజీలో పిల్లలకు మేం చెప్తూంటాం, ప్రతీ జీవికి జివిత పరమార్ధం " టు లివ్ అండ్ లీవ్ ఎ జెనరేషన్ బెహైండ్ " అని. బహుసా అది మానవులకు కూడా వర్తిస్తాది అనుకుంటాను.

బాబా బొల్లోజు
http://sahitheeyanam.blogspot.com/