Tuesday, May 6, 2008

ఈనాడు ,ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో ఒక వార్త

మంగళవారం విశాఖనగరానికి చెందిన ఒక్కో వార్తను ఈనాడు ,ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఎలా అందించాయో ఒక్కసారి మీరూ చూడండి.
పి. సుశీల యండమూరిలకు ఘన సన్మానం

విశాఖపట్నం, మే 5(ఆన్‌లైన్‌ కల్చరల్‌): ధనుంజయ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ దశమ వార్షికోత్సవ సందర్భంగా కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సంఘసేవా పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని వివిధ రంగాల్లో మానవతా దృక్పథంతో నిస్వార్థ సేవలందిస్తున్న పది మంది ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించారు. సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో గుర్తింపున్న వారిని సన్మానించడం గొప్పకాదని, ఏ మాత్రం గుర్తింపుని ఆశించకుండా మానవతా దృక్పథంతో సేవలందించిన వారిని సత్కరించడం హర్షించదగిన విషయమని కొనియాడారు.

తన జీవితంలో కొన్ని వేల సన్మానాలను చూసి పొందిన వాటి కంటే గొప్ప కార్యక్రమం ఇదేనని అభినందనలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై వుందని యండమూరి గుర్తు చేశారు. సినీ నేపథ్య గాయని పి.సుశీల గాన గొప్పదనాన్ని, అనుభవాన్ని ఆయన వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మభూషణ్‌ గాయని పి.సుశీలను యండమూరి వీరేంద్రనాథ్‌ దుశ్శాలువ కప్పి జ్ఞాపికను, సన్మానపత్రాన్ని అందజేసి సత్కరించారు. సంఘ సేవా పురస్కారాలను పి.సుశీల, యండమూరి చేతుల మీదుగా నిస్వార్థ సేవలందించిన ప్రముఖులు వి.ప్రసాదరావు, సాలూరి శేషుమాంబ, డాక్టర్‌ గిరివర్మ, ఎంఎస్‌కుమారి, ఎం.సత్తిరాజు, వి.వెంకటరత్నం, సంసుద్దీన్‌, ఆర్‌బి రాజు, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, సత్యంలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి సహకరించి ప్రోత్సహించిన, స్ఫూర్తినిచ్చిన యండమూరి వీరేంద్రనాథ్‌ను పి.సుశీల దుశ్సాలువతో సన్మానించారు. హైపవర్‌ ఎలివేటర్స్‌ ్రపైవేట్‌ లిమిటెడ్‌ ఎం.ఇస్మయిల్‌ జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ డైరెక్టర్‌ మళ్ల అరుణకుమారి, విజయ నిర్మాణ కంపెనీ ఎండి ఎస్‌.విజయకుమార్‌, సంగం అకాడమీ సంజయ్‌కిషోర్‌, కళాభారతి అధ్యక్షుడు సిఎస్‌ఎన్‌ రాజు తదితరులు పాల్గొనగా, శ్రీరాంబట్ల నృసింహశర్మ సభను నిర్వహించారు. ముందుగా న్యూ రోషన్‌లాల్‌ ఆర్క్రెస్టా కళాకారులు సుశీల ఆలపించిన పాటలు పాడి మెప్పించారు. నిర్వాహకులు ధనుంజయ సభకు కృతజ్ఞతలు తెలిపారు.






బెల్లు షాపుపై తెలుగు మహిళ దాడి
విశాఖపట్నం, మే 5 (ఆన్‌లైన్‌): తెలుగు మహిళలు మరోసారి బెల్టుషాపులపై విజృంభించారు. బెల్టు షాపుల ఆగడాలను అరికట్టేందుకు తెలుగు మహిళలు రంగంలోకి దిగారు. తెలుగు మహిళ కమిటీ సభ్యులు సుమారు 20 మంది ఎంవిపి కాలనీ, ఎఎస్‌ రాజా కళాశాల ప్రాంతంలో వున్న బెల్టు షాపుపై దాడి చేశారు. లోపల వున్న మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

ఎటువంటి లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న బెల్టు షాపులను తెలుగు మహిళ కమిటీ అంగీకరించదని, ప్రతీ బెల్టుషాపును ధ్వంసం చేస్తామని కమిటీ అధ్యక్షురాలు అన్నమరెడ్డి వాణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోట రత్నం, కమిటీ ప్రధాన కార్యదర్శి కాశి నాగమణి, ప్రచార కార్యదర్శి తులసి పార్వతి, కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న అప్పలనర్సమ్మ, లక్ష్మీ, ప్రభావతి, కామాక్షి తదితరులు పాల్గొన్నారు.



ఈనాడు

0 వ్యాఖ్యలు: