మనం రైతు బజారుకో.కూరగాయల మార్కెటుకో వెళ్ళి యేవంకాయలో తెచ్చుకుంటాము,డబ్బులిచ్చి.తెచ్చుకున్నాక వాటిని పులుసు చేస్తామో,వేపుడు చేస్తామో,గుత్తివంకాయ చేస్తామో,లేదా గ్రీన్ లాండ్ దేశస్థులలా హ్యుసఖ్య్త్ అనే వంట చేసుకుంటామో మన ఇష్టం.కొనగానే వంట చేసుకుని తినాలని రూలేమీ లేదు.వంకాయ పచ్చడి,వడియాలు,పాయసం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు,తాడుకి కట్టి వేలాడదీసి చూస్తూ ఉండొచ్చు.
ఇది మీ ఇంటికి,వంటకీ సంబంధించిన సంగతి.వాకే.
మనం యెవరో శాసనసభ్యులు,యమ్మెల్సీలు,యంపీలు వగైరాల దగ్గరకెళ్ళి కాస్త సమాచారం తెచ్చుకుంటాం.పైన వంకాయను చేసినట్టుగానే వార్తలను రకరకాలుగా `యిరగదీస్తామూ.వండి పాఠకుల,ప్రేక్షకుల మొహాన కొడతాము.వంకాయలకు వార్తలకు తేడా లేదా బాసూ అంటే,ఉందేమో గానీ అవి చూసే టైం లేదని సమాధానం.
ఇలాంటివార్తలు యెన్నాళ్ళు అలా చూస్తూ,వింటూ,చదువుతూ ఉండిపొతారు????
వంకాయల బొమ్మ ఇక్కడిది ;-http://susveg-asia.nri.org/susvegasiabrinjaltnau4.html
0 వ్యాఖ్యలు:
Post a Comment