Friday, September 16, 2011

ఆమెని పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారయ్యా


సౌందర్య రసాధిదేవత మార్లిన్ మన్రో  (http://en.wikipedia.org/wiki/Marilyn_Monroe)
"సంలైక్ ఇట్ హాట్"(http://en.wikipedia.org/wiki/Some_Like_It_Hot)
సినిమా షూటింగుకు విపరీతమైన ఆలస్యంగా రావటం,స్టార్ హీరోయిన్ ఎన్ని నకరాలు పోవాలో అన్నీ పోతూ చిత్రదర్శకుడు బిల్లీ వైల్డరు(http://en.wikipedia.org/wiki/Billy_Wilder)ని తెగవిసిగించేసింది.మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఒక జిజ్ఞాసువుకు ఒక ధర్మసందేహం వచ్చింది. " అయ్యా బిల్లీ వైల్డరు గారూ మార్లిన్ మన్రో మిమ్మల్ని ఇంతగా విసిగించింది,ఆలస్యంగా వచ్చింది,హీరో టోనీ కర్టిస్-http://en.wikipedia.org/wiki/Tony_Curtis
తో అసలు మాట్లాడలేదు,యింత చేసిన ఆవిడ్ని మళ్ళీ మీ సినిమాలోకి తీసుకుంటారా" అని అడిగితే,
మా ఊళ్ళో మా మెనత్త ఉంది,ఆమె అంటే నాకు చాలా ఇష్టం,ఆమె చాలా మంచిది,టైం చక్కగా పాటిస్తుంది కానీ ఆమెని పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారయ్యా ???"   అన్నారు.

0 వ్యాఖ్యలు: