పెరుగుతున్న నైరాశ్యానికి ప్రతిబింబం!
ఒక ఊరి కథ!!
తెలుగుచిత్రాలపై వెలుగురేఖలు ప్రసరిస్తుందా?
అశక్త సజ్జనుల అకర్మణత్వం....జీవితం పట్ల ఎందుకో లేని ఆసక్తి..కష్టించే ఉత్సాహం లేదు..సుఖించే ఆశ లేదు,బ్రతుకొక యంత్రం...కష్టజీవి కేవలం కర్మజీవి...నిమిత్తమాత్రుడు....
ఇదీ,ఈనాటి మనిషిలో నానాటికీ పెరుగుతోన్న నిరాశ!ఈ నిరాశ ప్రభావం ఇంక రాబోయే తరాలపైన ఎలా వుంటుందో తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
“ఒక ఊరి కథ "లో, కథ దృష్ట్యా ఆలోచిస్తే శ్రామిక వర్గంలో కనిపించే క్రియారాహిత్యం లేక సోమరితనం ప్రధానాంశం అయినా,ఈ కథలో చర్చించబడ్ద సిద్ధాంతం మాత్రం పరిణామక్రమంలో మనిషిలో పెచ్చుపెరిగిన నైరాశ్యాన్ని చక్కగా ప్రతిబింబిస్తుంది."కష్టించేవా డు సుఖపడ లేకపోతుంటే సుఖం లేని కష్టం ఎందుకు పడాలి....? అనే ఓ తిరుగుబాటు ధోరణి ఈ చిత్రంలో ప్రధానంగా కనిపిస్తుంది.
బాధల పల్లకి బోయీలు....!
కష్టసుఖాల బేరీజులో దుఃఖభాజనుడైన మనిషికి ఊరట కల్పించే అంశాలు కొరవడినా,దుఃఖకారణాలపై సమరానికి శంఖారావం వినిపించకపోయినా,దర్సకుడు శ్రీమృణాళ్ సేన్ తాను ఎంచుకున్న సబ్జెక్టును సూటిగా చెప్పడంలో నిర్మొహమాటంగానే వ్యవహరించాడనే చెప్పాలి.
నిజానికి కష్టజీవులంతా ‘బాధలపల్లకీ బోయీలు,జీవితం కరుణించని వాళ్లు-ధరిత్రిపై జన్మ తప్ప చరిత్రలో చోటు లేనివాళ్ళు’-అందుకే-
"మొద్దుమనిషి ఎద్దులా
సేసిసేసి సస్తడు
మోసగాడు పరులసొమ్ము
మేసిమేసి బలుస్తడు’
అంటూ తాగివాగినా,వెంకయ్య మాటల్లోని అంతరార్థాన్నీ దాంట్లో అంతర్లీనమైవున్న ఉగ్రవాదతత్వాన్నీ అర్థంచేసుకోలేని ఊళ్ళో జనాన్నీ,కష్టించడమే తప్ప సుఖపడ్డపాపాన పోని వాళ్ళలోని అమాయకత్వాన్ని-’మొద్దుమొహాలు‘ అంటూ ఈసడించుకొనే అసలైన వేదాంతి వెంకయ్య-లోకం దృష్టిలో మాత్రం ‘పెద్ద పనిదొంగ’.
పని దెయ్యం పట్టిన కార్మికులు
పని దొంగ వెంకయ్య తనకొడుకునూ కష్టపడి పనిదొంగగానే పెంచాడు.పనిదొంగగా పెరిగిన కొడుకు కిష్టయ్య ఒకరోజు తాను పెళ్ళిచేసుకుంటానంటే,కష్టపడి పనిచేసి పెళ్ళాన్ని పోషించుకుంటానంటే-"ఒరే,కిష్టా, నీకు యిష్టమైతే పెళ్లి చేసుకో,అయితే ఒక్కమాట సెప్తున్నా,ఈపనిదెయ్యం ఒకసారి పట్టిందంటే వదలదురా"అని వారించి చూశాడు."ఈపని అనే ఊబిలో ఒక్కసారి దిగావా,దీంట్లోనే కూరుకు పోతావ్ రా" అని బెదిరించాడు.అయిన వినని కొడుక్కి మనసుపడ్ద అమ్మాయినిచ్చి పెళ్ళిచేశాడు.అయినా,పెళ్ళాన్ని పోషించమని ఆ కొడుక్కి చెప్పలేని తండ్రి,చిల్లర దొంగతనాలకు వెంటేసుకుని తిరుగుతుంటే,నెలలు నిండిన కోడలు పిడకలమ్మీ,వడ్లుదంచీ,నూకలు తెచ్చి వెండిపెడుతుంటే కూర్చుని తినడానికి సిగ్గుపడని ఆ తండ్రీకొడుకులు,ఆమెకు మంత్రసాని అవసరమైనప్పుడు,డబ్బు లేదని కాళ్ళు ముడుచుకు పడుకున్నందుకు,ఆ యింటిదీపం కాస్తా ఆరిపోయినప్పుడు,శవాన్ని లేపడానికి చందాలుపోగుచేసి,దోసెడు నిండేసరికి-కిష్టా! నాకు మైకం కమ్ముతుందిరా,కిష్టా నా గుప్పెట్లోంచి వేడి పుట్టుకొస్తుంది,గుప్పెటిమొత్తా న్ని అదిమిపట్టుకో"అంటూ వెర్రెత్తినవాడిలా అరుస్తుంటాడు వెంకయ్య!
"రోజూ నిద్ర లేవంగానే ఈ గుప్పిట్లో ఇంతడబ్బుంటే,విచిత్రమైన శక్తి యీ గుప్పిట్లోవుంటే ఏది కోరుకుంటే అది దొరుకుతుంది!పట్టుకో,బాగా అదిమి పట్టుకో,చెప్పు .....ఛూమంతర్.....
మాకు రెండు బస్తాల బియ్యం ఇవ్వూ...
మా చింపిరిగుడ్డల బదులు మంచిబట్ట ఇవ్వూ....
మా కూలిపోతున్న గుడిసె బదులు మంచియిల్లు ఇవ్వూ...
మా సచ్చిపోయిన పిల్లకు ప్రాణాలు ఇవ్వూ....
అలా వెర్రిబాగుల వెంకయ్య గోలపెడ్తోంటే,పని ఊబిలో కూరుకున్న నీలమ్మ శవం ఆ ఊబిలోనే కలిసిపోతుంటుంది!
కష్టపడం -సుఖం కావాలి
ఇది ఒక ఊరి కథకాదు,ఒక కుటుంబం కథ కాదు,ఇది ఒక తరం కథ!ఈ తరం కథ!
ఇది శ్రమజీవిపై నిందలు వేయడం కాదు.ఈ తరం మనిషి మనసులో హాలాహలంలా వ్యాపించి ఉన్న అడ్డదారులు తొక్కాలనే ఒక పిచ్చి తాపత్రయంపై దెబ్బతీయడమే!అయినా కష్టించకుండానే సుఖపడాలి అనే నినాదానికి కత్తిపోట్లు పొడిచి ‘మృణాళ్ సేన్’ప్రేక్షకుడికి హతుణ్ణి దాచి రక్తపుమరకల్ని మాత్రమే చూపించాడేమో ననిపించింది.
సుఖపడేవాడు ఎలా సుఖపడుతున్నాడో ఎత్తిచూపించడం పైనే దృష్టిని కేంద్రీకరించటం వలన ఈ కథకు చక్కటి ప్రయోజనం చేకూరినా,"ఒక ఊరి కథ ఒక డాక్యుమెంటరీయే" నన్న విమర్శకు అవకాశం కల్పించని రీతిలో దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచేందుకు ప్రయత్నం చేయకపోవడం,తను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా,ఏవిధమైన అవరోధాలు లేని రీతిలో చిత్రించాలనేనిశ్చయాన్ని కలిగి ఉండడమేనని దర్శకత్వపు తీరు చెప్పకచెప్తుంది.
లోపించిన వివరణ
‘స్ర్టగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’లో కాయకష్టం కడుపు నింపనప్పుడు,అడ్డదారులు తొక్కడం తప్పని సరియైన దొంగను నిందించేకన్నా,ఈ సమాజాన్ని దుమ్మెత్తిపోసేకన్నా,ఏవేవో ఇజాల పేరుతో ఈ వ్యవస్థ గురించి శుష్క నినాదాలు ఇచ్చేకన్నా-దోపిడీకి మూలమైన ధనిక-బీద అంతరం మీద దెబ్బతీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మృణాళ్ సేన్ భావాల్ని అర్థం చేసుకోడానికి ప్రేక్షకుడికి కొంత అవకాశాన్నిచ్చే రీతిలో మలచిఉంటే ఈ చిత్రం కేవలం మేధావి వర్గానికే పరిమితమై వుండేది కాదేమో....!
ఏమైనా,మృణాళ్ సేన్ చిత్రాన్ని కేవలం ఒక సినిమాలా గాక ఒక సిద్ధాంతంలా,ఒక ఉపన్యాసంలా,ఒక ప్రభోదంలా,ఒక ఉద్యమంలా భావించి ఆలోచిస్తే కథ విషయంలో అపార్థాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నా,పని ఎగవేయడం పట్ల ఆసక్తి ధనవంతుల దోపిడీవలన మాత్రమే కాదనీ,పరిణామక్రమంలో మనిషి ఆలోచనా విధానంలో కలిగిన ‘మార్పు’ వలననేనని స్పష్టమవుతుంది.వైజ్ఞానిక రంగంలోని ఆధునిక పరిశోధనలు సైతం మనిషి కష్టపడకుండా సుఖించేందు కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే!
ప్రయోజనం కలిగించిన ప్రయోగం
అయితే,అది సైన్సు కాబట్టి దాన్ని విమర్సించిన వాడు అభివృద్ధి నిరోధకుడు.ఇది జీవితం కాబట్టి దీన్ని మాత్రమే విమర్శించే వాడు సిద్ధాంతకర్త!....విప్లవయోధుడు! ‘మార్పు ఇలాగే వచ్చిమ్ది.ఇది మనిషి ఆలోచనా సరళిలో లోపం!మృణాళ్ సేన్ ప్రయోగం వలన ఈ మార్పుకు కారణాలు వెదకాలనే ఒక ఆలోచన కలగడం అనే ప్రయోజనం మాత్రం సిద్ధించింది.ఇక పిక్చరైజేషన్ కు వస్తే,దర్శకుడి నీటైన చిత్రీకరణకు ధీటైన ‘చోమనదుడి’వాసుదేవరావు నటన తెలుగు ప్రేక్షకుడు మరచిపోరానిది.కె.కె.మహాజన్ కెమెరా సూపర్ ఫైన్!మిగతా అన్నివిధాలా ‘ఒక ఊరి కథ’పూర్!మాటలుగాని,సంగీతం గాని ఉత్తేజాన్ని కలిగించలేకపోవడం లోపమే.ఉన్న ఆ కొన్ని మాటలను అర్థం అయ్యేట్లు,వినపడేట్లు జాగ్రత్త తీసుకుంటే వచ్చే నష్ట్టం ఏమిటో ఆర్థం కాలేదు.ఆవార్డులు పొందిన చిత్రం కాబట్టి,తెలుగుదేశానికి దీనివలన ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించినా తెలుగు చిత్రాలపై దీని వెలుగురేఖల ప్రభావం అంతగా ఉండదనేది నిర్వివాదం!
-జి.వి.పూర్ణచందు,స్పందనవాణి, జనవరి,1979.
ఒక ఊరి కథ!!
తెలుగుచిత్రాలపై వెలుగురేఖలు ప్రసరిస్తుందా?
అశక్త సజ్జనుల అకర్మణత్వం....జీవితం పట్ల ఎందుకో లేని ఆసక్తి..కష్టించే ఉత్సాహం లేదు..సుఖించే ఆశ లేదు,బ్రతుకొక యంత్రం...కష్టజీవి కేవలం కర్మజీవి...నిమిత్తమాత్రుడు....
ఇదీ,ఈనాటి మనిషిలో నానాటికీ పెరుగుతోన్న నిరాశ!ఈ నిరాశ ప్రభావం ఇంక రాబోయే తరాలపైన ఎలా వుంటుందో తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
“ఒక ఊరి కథ "లో, కథ దృష్ట్యా ఆలోచిస్తే శ్రామిక వర్గంలో కనిపించే క్రియారాహిత్యం లేక సోమరితనం ప్రధానాంశం అయినా,ఈ కథలో చర్చించబడ్ద సిద్ధాంతం మాత్రం పరిణామక్రమంలో మనిషిలో పెచ్చుపెరిగిన నైరాశ్యాన్ని చక్కగా ప్రతిబింబిస్తుంది."కష్టించేవా
బాధల పల్లకి బోయీలు....!
కష్టసుఖాల బేరీజులో దుఃఖభాజనుడైన మనిషికి ఊరట కల్పించే అంశాలు కొరవడినా,దుఃఖకారణాలపై సమరానికి శంఖారావం వినిపించకపోయినా,దర్సకుడు శ్రీమృణాళ్ సేన్ తాను ఎంచుకున్న సబ్జెక్టును సూటిగా చెప్పడంలో నిర్మొహమాటంగానే వ్యవహరించాడనే చెప్పాలి.
నిజానికి కష్టజీవులంతా ‘బాధలపల్లకీ బోయీలు,జీవితం కరుణించని వాళ్లు-ధరిత్రిపై జన్మ తప్ప చరిత్రలో చోటు లేనివాళ్ళు’-అందుకే-
"మొద్దుమనిషి ఎద్దులా
సేసిసేసి సస్తడు
మోసగాడు పరులసొమ్ము
మేసిమేసి బలుస్తడు’
అంటూ తాగివాగినా,వెంకయ్య మాటల్లోని అంతరార్థాన్నీ దాంట్లో అంతర్లీనమైవున్న ఉగ్రవాదతత్వాన్నీ అర్థంచేసుకోలేని ఊళ్ళో జనాన్నీ,కష్టించడమే తప్ప సుఖపడ్డపాపాన పోని వాళ్ళలోని అమాయకత్వాన్ని-’మొద్దుమొహాలు‘ అంటూ ఈసడించుకొనే అసలైన వేదాంతి వెంకయ్య-లోకం దృష్టిలో మాత్రం ‘పెద్ద పనిదొంగ’.
పని దెయ్యం పట్టిన కార్మికులు
పని దొంగ వెంకయ్య తనకొడుకునూ కష్టపడి పనిదొంగగానే పెంచాడు.పనిదొంగగా పెరిగిన కొడుకు కిష్టయ్య ఒకరోజు తాను పెళ్ళిచేసుకుంటానంటే,కష్టపడి పనిచేసి పెళ్ళాన్ని పోషించుకుంటానంటే-"ఒరే,కిష్టా,
"రోజూ నిద్ర లేవంగానే ఈ గుప్పిట్లో ఇంతడబ్బుంటే,విచిత్రమైన శక్తి యీ గుప్పిట్లోవుంటే ఏది కోరుకుంటే అది దొరుకుతుంది!పట్టుకో,బాగా అదిమి పట్టుకో,చెప్పు .....ఛూమంతర్.....
మాకు రెండు బస్తాల బియ్యం ఇవ్వూ...
మా చింపిరిగుడ్డల బదులు మంచిబట్ట ఇవ్వూ....
మా కూలిపోతున్న గుడిసె బదులు మంచియిల్లు ఇవ్వూ...
మా సచ్చిపోయిన పిల్లకు ప్రాణాలు ఇవ్వూ....
అలా వెర్రిబాగుల వెంకయ్య గోలపెడ్తోంటే,పని ఊబిలో కూరుకున్న నీలమ్మ శవం ఆ ఊబిలోనే కలిసిపోతుంటుంది!
కష్టపడం -సుఖం కావాలి
ఇది ఒక ఊరి కథకాదు,ఒక కుటుంబం కథ కాదు,ఇది ఒక తరం కథ!ఈ తరం కథ!
ఇది శ్రమజీవిపై నిందలు వేయడం కాదు.ఈ తరం మనిషి మనసులో హాలాహలంలా వ్యాపించి ఉన్న అడ్డదారులు తొక్కాలనే ఒక పిచ్చి తాపత్రయంపై దెబ్బతీయడమే!అయినా కష్టించకుండానే సుఖపడాలి అనే నినాదానికి కత్తిపోట్లు పొడిచి ‘మృణాళ్ సేన్’ప్రేక్షకుడికి హతుణ్ణి దాచి రక్తపుమరకల్ని మాత్రమే చూపించాడేమో ననిపించింది.
సుఖపడేవాడు ఎలా సుఖపడుతున్నాడో ఎత్తిచూపించడం పైనే దృష్టిని కేంద్రీకరించటం వలన ఈ కథకు చక్కటి ప్రయోజనం చేకూరినా,"ఒక ఊరి కథ ఒక డాక్యుమెంటరీయే" నన్న విమర్శకు అవకాశం కల్పించని రీతిలో దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచేందుకు ప్రయత్నం చేయకపోవడం,తను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా,ఏవిధమైన అవరోధాలు లేని రీతిలో చిత్రించాలనేనిశ్చయాన్ని కలిగి ఉండడమేనని దర్శకత్వపు తీరు చెప్పకచెప్తుంది.
లోపించిన వివరణ
‘స్ర్టగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’లో కాయకష్టం కడుపు నింపనప్పుడు,అడ్డదారులు తొక్కడం తప్పని సరియైన దొంగను నిందించేకన్నా,ఈ సమాజాన్ని దుమ్మెత్తిపోసేకన్నా,ఏవేవో ఇజాల పేరుతో ఈ వ్యవస్థ గురించి శుష్క నినాదాలు ఇచ్చేకన్నా-దోపిడీకి మూలమైన ధనిక-బీద అంతరం మీద దెబ్బతీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మృణాళ్ సేన్ భావాల్ని అర్థం చేసుకోడానికి ప్రేక్షకుడికి కొంత అవకాశాన్నిచ్చే రీతిలో మలచిఉంటే ఈ చిత్రం కేవలం మేధావి వర్గానికే పరిమితమై వుండేది కాదేమో....!
ఏమైనా,మృణాళ్ సేన్ చిత్రాన్ని కేవలం ఒక సినిమాలా గాక ఒక సిద్ధాంతంలా,ఒక ఉపన్యాసంలా,ఒక ప్రభోదంలా,ఒక ఉద్యమంలా భావించి ఆలోచిస్తే కథ విషయంలో అపార్థాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నా,పని ఎగవేయడం పట్ల ఆసక్తి ధనవంతుల దోపిడీవలన మాత్రమే కాదనీ,పరిణామక్రమంలో మనిషి ఆలోచనా విధానంలో కలిగిన ‘మార్పు’ వలననేనని స్పష్టమవుతుంది.వైజ్ఞానిక రంగంలోని ఆధునిక పరిశోధనలు సైతం మనిషి కష్టపడకుండా సుఖించేందు కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే!
ప్రయోజనం కలిగించిన ప్రయోగం
అయితే,అది సైన్సు కాబట్టి దాన్ని విమర్సించిన వాడు అభివృద్ధి నిరోధకుడు.ఇది జీవితం కాబట్టి దీన్ని మాత్రమే విమర్శించే వాడు సిద్ధాంతకర్త!....విప్లవయోధుడు!
-జి.వి.పూర్ణచందు,స్పందనవాణి,

0 వ్యాఖ్యలు:
Post a Comment