Monday, October 17, 2011

మొన్న (శనివారం)జాలాది గారి అంత్యక్రియలకు హాజరయ్యాను

మొన్న (శనివారం)జాలాది గారి అంత్యక్రియలకు హాజరయ్యాను.ఆయనకు ఇంటిదగ్గర నివాళులు
అర్పించిన వాళ్ళ సంగతేమోగాని,నేను అంత్యక్రియల దగ్గర(వాల్టేర్ సిమెట్రీ)ఉన్న అయిదున్నరగంటల్లో
అక్కడికి వచ్చిన వాళ్లలో బంధుమిత్రులు,అభిమానులు తప్ప ఒక్క ప్రముఖుడూ కనిపించలేదు,వస్తారని
నేనూ ఊహించలేదు.
నిన్న(ఆదివారం సాయంత్రం)జాలాదిగారి ఇంటిదగ్గర సంస్మరణ సభ జరిగింది.సభాప్రారంభానికి ముందర
కొందరు ఎమ్మెల్యేలు తప్ప మరే ప్రసిధ్ధులూ కనిపించలేదు.ఇంట్లోకెళ్ళి కూర్చుని జాలాది గారి పిల్లలతో
మాట్లాడుతూ ఉండిపోయాను తప్ప శ్రీమతిజాలాదిని చూసే ధైర్యం చేయలేకపోయాను.సంస్మరణసభలో
పాల్గొన్న బంధుమిత్రులు నాకు తెలియని చాలా విషయాలు తెలియజేసారు.అవి మరొక్కసారి తీరిగ్గా
నా బ్లాగులో.

2 వ్యాఖ్యలు:

yaramana said...

జాలాది అత్యక్రియలకి ప్రముఖులు రారని మీరు అనుకున్నారు. నేనూ అనుకున్నాను. కారణం జగద్విదితం.
ఆంధ్రజ్యోతిలో కవి ఎండ్లూరి సుధాకర్ వ్యాసం చదివాక.. మనసు వికలం అయిపోయింది. ఎంత అమానవీయ సమాజంలో బ్రతుకుతున్నాం మనం!

rajasekhar Dasari said...

జాలాది గారి గురించి మీరు వ్రాయబోయే దాని గురించి ఎదురుచూస్తున్నాను , తొందరగా వ్రాయండి