Saturday, November 12, 2011

ఓవర్ రేటెడ్ సినిమా డ్రైవర్


ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా రాలేదని ప్రచారం ఊదరగొట్టిన సినిమా ఇది.
కథానాయకుడి పాత్రకు పేరు ఉండదు.అతగాడు హాలీవుడ్ లొ 
స్టంట్ మాన్,ఖాళీ సమయాల్లో దొంగతనాలు చేసిపారిపోయేవారిని సురక్షితంగా వేరే చోటికి చేరుస్తుంటాడు
అదీ అయిదంటే అయిదునిమిషాలే టైం.
పక్కపోర్షన్ లో అద్దెకుంటున్న అమ్మాయి (వాస్తవంగా సినిమాలో ఒక పిల్లాడి తల్లి) తో పరిచయమవటం,
హీరో పీకల్లోతు క్రైములో ఇరుక్కుపోవటం యథాతథం.
హీరో Ryan Gosling కాసేపు హృతిక్ రోషన్ లా కాసేపు విక్రం లా కనిపిస్తాడు,అతనికిచ్చిన నాలుగు డైలాగులు కూడా నికోలస్ కేజ్ లా చెపుతుంటాడు.
ప్రధానపాత్రధారిణి Carey Mulligan స్కూలుపిల్లలా క్యూట్ గా ఉంది.ఉన్నంతలో బాగా చేసింది.
సినిమా మొదలైన 40 నిమిషాలవరకూ కథ అక్కడక్కడే తిరుగుతూ చిరాకు పుట్టిస్తుంది.
కథ పాకాన పడింది అనుకునే లోపు సినిమా అయిపోతుంది.హింస,రక్తపాతం చాలా ఎక్కువే.
ఈ సినిమాకు హైలైట్ మ్యూజిక్,చాలా కాలం తర్వాత మంచి వాద్య గోష్ఠి వినొచ్చు.
నాకైతే అదొక్కటే దక్కుదల అనిపించింది.
/http://www.imdb.com/title/tt0780504/

0 వ్యాఖ్యలు: